తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగల పాత్ర ఎంతో ముఖ్యం
మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మాదిగా మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదిగ, మాదిగ ఉపక్కులాల మేధావుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉప కులాల ఎస్సీ వర్గీకరణకై ఎవరైతే కృషి చేశారో వారికి సన్మాన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్ ను నియమించి, ఎస్సీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి మాదిగ ఉపకాల సహకరించాలని కోరారు. అంతేకాకుండా టీఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్బండ్ పై నెలకొల్పి వారి జయంతిని అధికారకంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మాదిగ కులాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.