పెండింగులో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల పెండింగ్లో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భిక్షాటన చేయడం జరిగింది.

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యలమల గోపీచంద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి సీఎం కేసీఆర్ విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలని పెట్టాలి.ప్రభుత్వ హాస్టల్లో ఉన్న సమస్యలు తీర్చలేని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ప్రభుత్వం విద్యార్థులు సమస్యలు పట్టించుకొని ఎడల ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీనగర జాయింట్ సెక్రెటరీ రాకేష్ సోషల్ మీడియా ఇంచార్జి అంకూరి శ్రీకాంత్ , K.శివ , నగర ఉపాధ్యక్షులు బత్తుల ప్రభు
నగర మహిళా ఇన్చార్జ్ అంకురి శ్రావ్య , నగర SFD- ఇంచార్జ్ k.నందిని , k. సరిత, అశ్విని, అనురాధ, ఉమా, కమలాకర్ , గణేష్ , తదుపరులు పాల్గొన్నారు…