పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు బస్తి దవాఖాన లు ఏర్పాటు-పశుసంవర్ధక శాఖ మంత్రి తలచిన శ్రీనివాస్ యాదవ్

పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు బస్తి దవాఖాన లు ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలచిన శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నందమూరి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ను మంత్రి శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఇన్చార్జి మరియు రాజశేఖర్ రెడ్డి చైర్మన్లు కృశాంక్, నగేష్ కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో బస్తీ దవాఖాన తీసుకొచ్చినట్లు తెలిపారు.. బస్తీ దవాఖానాలో మెరుగైన సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని అందించేందుకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.. మరిన్ని ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురావల్సిన అవశ్యకత ఉందన్నారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్లు ఇప్పటికీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.. కంటోన్మెంట్ లో రాజకీయంగా బారాస పటిష్టంగా ఉందని వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి సీటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు..