బాసరఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఐ.కె రెడ్డి

  • అంగరంగ వైభవంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు…

బాసర : చదువులతల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు నిర్మల్ జిల్లాలోని వ్యాస ప్రతిష్ట బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రంలోఅంగరంగ వైభవంగామొదలయ్యాయి. గురువారం శ్రీపంచమి రోజు ఉదయం7 తెల్లవారుజాము మంగళ వాయిద్య సేవ, గురుప్రార్థన గణపతి పూజలతో అభిషేకం కార్యక్రమాలు జరిగిగా…ఉదయం 3గం.ల తెల్లవారు జాము నుండి ప్రత్యేక అక్షరాభ్యాసానికి భక్తులను అనుమతి0చారు. 7 గంటల నుండి చండీ మహా విద్యా హోమము, బలిప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమాలను స్థానాచార్య ఆధ్వర్యంలో వైదికులు నిర్వహి0చారు.ముఖ్య అతిథులుగా న్యాయ దేవాదాయ,పర్యావరణ,అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎమ్మెల్సి దండేవిఠల్,నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి,ప్రముఖులు అమ్మవారి ఆలయానికి వచ్చి పట్టు వస్త్రములను సమర్పి0చి, దర్శించుకున్నారు.ఇప్పటికే రాష్ట్రం,పక్క రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.మహారాష్ట్ర రాష్ట్ర0 నుంచి సైతం ప్రముఖులు హాజరై దర్శనం చేసుకుంటున్నారు.