మరిపెడలో వైద్యం వికటించి బాలింత మృతి

తల్లి కి దూరమైన ఇద్దరు చిన్నారులు

సుఖ ప్రసావాలు చేయడంలో వైద్యాధికారి గుగులోత్ రవి నాయక్ కు ఎంతో మంచి పేరు ఉన్నది.మరిపెడ ప్రాథమిక హాస్పిటల్ లో సోమవారం రోజున మరిపెడ గ్రామానికి చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మికి చిన్న సిజేరియన్ చేసి,సుఖ ప్రసవం చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.అనంతరం డాక్టర్ రవికి ఫోన్ రావడంతో బయటికి వెళ్లిపోయారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.అధిక రక్తస్రావం కావడంతో బాలింత మృతి చెందిందని,ఆ తర్వాత డాక్టర్ రవి హాస్పిటల్ కి వచ్చి మహుబూబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులను సూచించగా, హుటా హుటిన అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించగా,అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పుడే మృతి చెందిందని నిర్ధారించారన్నారు. మృతి చెందిన బాలింతను మరిపెడ ప్రాథమిక ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచి,తన పిల్లలకు న్యాయం జరిగేంత వరకు శవంతో ఇక్కడే ఉంటామని, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు.డాక్టర్ రవిని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.