లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని అలాగే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ముస్తాబాద్ కాంగ్రెస్ నేతల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి. ఆధ్వర్యంలో రైతులకు వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని అలాగే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన రహదారిపై గంట పాటు ధర్నా చేపట్టారు అనంతరం సీఎం కేసిఆర్ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి మాట్లాడుతూ 2018 లో ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా రుణమాఫీ చేయలేదు అకాల వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క రైతుకు ఇచ్చిన దాఖలాలు లేవని ఆన్నారు మాటలు మాంత్రికుడు తుపాకీ రాముని మాటలను మించిపోయిన మాటకారి మన సీఎం అని మండిపడ్డారు ఇక్కడి రైతులకు దిక్కులేదు కానీ పంజాబ్ రైతులకు మాత్రం మన డబ్బును పంచిపెట్టారు ఇట్లాంటి వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫాం హౌస్ కి పరిమితం చేయాలని ప్రజలను కోరారు ప్రజలు రైతులు యువకులు విజ్ఞతతో ఆలోచించి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు కాంగ్రెస్ పార్టీ వల్లనే సకల జనులు సంతోషంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొండం రాజిరెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు రాములు ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు చికోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ దీటి నర్సింలు పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు అనమేని రాజు నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నెబాను మామిండ్ల ఆంజనేయులు. అరుట్ల మహేష్ వేముల సత్యం గౌడ్ మాజీ సర్పంచ్ తిరుపతి ఆగుల్ల రాజేశం ఆరుట్ల మహేష్ రెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి వంగ మోహన్ రెడ్డి క్యారమ్ రాజు కమ్మరి శ్రీనివాస్ జంగిడి బాలరాజు రామచంద్రం నారాయణ రెడ్డి రాజేశం ఎస్టి సెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు