వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ ఎస్ కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారి సమక్షంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సిరంగి సునీల్ మరియు సుమారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఏఐసిసి కిసాన్ సెల్ వైస్ ఛైర్మన్ & టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి గారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, రుద్వేగ్ రెడ్డి, జన్ను అనిల్ 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీరం రవీందర్ రెడ్డి, కందుకూరి పూర్ణచందర్, రజినీకాంత్, బొమ్మ చంద్రమౌళి గౌడ్, వియ్యాల సునీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు….