విద్య తో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి- కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి

విద్య తో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలోను ఆత్మ రక్షణ కళల ను విద్యార్థులకు నేర్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు కూకట్పల్లి ప్రగతి నగర్ లోని ప్రగతి సెంట్రల్ స్కూల్లో ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ 14 సంవత్సరాల లోపు విద్యార్థులచే కరాటే లో ఒక నిమిషంలో 200 పంచ్ లు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే జూడో వంటి కళలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు స్వీయ రక్షణ లో మెలకువలు ఏర్పడతాయన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ ఒక నిమిషంలో 200 పంచులు ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని ఈ ఫీట్ ని సాధించిన ప్రగతి స్కూల్ విద్యార్థులు, విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దిన ట్రైనర్ గీత అభినందనీయులన్నారు.