సామాన్య కార్యకర్తలా మారిన మంత్రి జగదీష్ రెడ్డి

  • కాన్వాయ్ పక్కన పెట్టి… కార్యకర్తల తో జత కట్టి
  • మంత్రి హోదా ను పక్కన పెట్టి లారీ లో కార్యకర్తల తో కలిసి ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ కు తరలి వెళ్ళిన మంత్రి

మంత్రి జగదీష్ రెడ్డి తను మంత్రిగా ఏనాడూ తన అధికార దర్పాన్ని ప్రదర్శించకపోగా ఓ సామాన్య కార్యకర్తలా మంత్రి జగదీష్ రెడ్డి మారారు. బుధవారం ఖమ్మం లో బీఆర్ఎస్ బహిరంగ సభ నేపథ్యం లో తన కాన్వాయ్ ను పక్కన పెట్టి మంత్రి జగదీష్ రెడ్డి కార్యకర్తలతో జత కట్టారు. సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట గ్రామం నుండి కార్యర్తలు వెళుతున్న లారీ లో ఎక్కి ఖమ్మం వరకు ప్రయాణించి వారిలో జోష్ నింపారు. బిఅరెస్ నాయకులు తాము ప్రయాణిస్తున్న లారీ లో మంత్రి ఎక్కి తమతో పాటు సభ వరకు రావడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.మంత్రి చర్యతో కాసేపటికి తేరుకున్న కార్యకర్తలు మంత్రి తో ముచ్చటిస్తూ,సభా ప్రాంగాణానికి చేరుకున్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం బీఆర్ఎస్ సభ తో దేశంలో రాజకీయంగా పెను మార్పులు తథ్యం అన్నారు.తెలంగాణ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది నమూనా ను యావత్ భారతావణి కోరుకుంటుందన్నారు.అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.