Telangana

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు యువకులు మృతి

సూర్యాపేట-ఖమ్మం క్రాస్ రోడ్డు గురువారం అర్ధరాత్రి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరికొద్ది రోజుల్లో న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉన్న నవీద్ అనే యువకుడు స్నేహితులకు రంజాన్ పర్వదినం సందర్భంగా విందును ఏర్పాటు చేశాడు. పార్టీ ముగించుకుని వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా సూర్యాపేట-ఖమ్మం ఫ్లైఓవర్పై వెళుతున్న డీసీఎంను వెనకనుంచి వారి కారు బలంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. కార్ లో ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్ సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *