సూర్యాపేట 29వార్డ్ లో కంటి వెలుగు -2 ప్రారంభం

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యపేట 29వ వార్డు కౌన్సిలర్ అనంతల యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ 29 వార్డులో ఎనిమిది రోజులపాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చేవారికి ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని వార్డు ప్రజలకు సూచించారు.రాష్ట్రంలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా అవసరమైన వారికి అక్కడే కళ్ళద్దాలు, మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కంటికి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేపిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటిగా వార్డ్ కౌన్సిలర్ అనంతల యాదగిరి గౌడ్ మరియు టౌన్ ఎస్ఐ క్రాంతికుమార్ కంటి పరీక్షల ను చెపించచుకున్నారు.. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కుసుమ ,వైద్యాధికారి హరిప్రసాద్, ఆశా వర్కర్లు అంగనవాడి టీచర్లు ఏఎన్ఎంలు హెల్త్ సూపర్వైజర్లు వార్డు ఆఫీసరు వార్డు జవాన్ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.