సేవే లక్ష్యంగా కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్..!!ట్రస్ట్ ఆద్వర్యంలో మద్దిర్యాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం.
సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అంతర్గాం మండలం మద్దిర్యాల గ్రామానికి చెందిన యువకుడు కందుల సాగర్.తన తండ్రి మరణానంతరం వారి పేరుమీద కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ఎర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలని చేపడుతున్నారు.ఇందులో భగంగా అంతర్గాం మండలం మద్దీర్యాల గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజేపి రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి హాజరై మొక్కలు నాటడం జరిగింది…
సమాజానికి సేవ చెయాలనే ఉద్దేశ్యంతో కందుల రాజన్న పటేల్ ట్రష్ట్

సమాజానికి సేవ చెయాలనే ఉద్దేశ్యంతో తమ్ముడు కందుల సాగర్ వారి తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ పేరుతో ట్రష్ట్ ని ఎర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. తండ్రి మరణానంతరం వారి పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు.. వృత్తి రిత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డా, సోంత ఊరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో మద్దిర్యాల గ్రామంలో కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలని గ్రామంలో గతంలో చేపట్టడం జరిగిందన్నారు. అదే ఉద్దేశ్యంతో పర్యావరణ హితం కోసం మేము సైతం అంటూ… ఈరోజు వారి ట్రస్ట్ ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మద్దిర్యాల గ్రామం నుండి ఇస్సంపేట వెల్లే దారికి ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందన్నారు.యువత ప్రతీ ఒక్కరు కందుల సాగర్ ని స్పూర్తిగా తీసుకోని ముందుకెల్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సంధర్బంగా సాగర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కందుల రవిందర్,సందెల మల్లయ్య,ముక్కెర మల్లయ్య,భూపల్లి రాజేశం,ముక్కెర రాములు,ముక్కెర గంగయ్య,బరుపటి నారాయణ,బోడకుంటి సుభాష్,రాణాప్రతాప్,అభిషేక్,విధ్యాసాగర్,అమర్,మొటపలుకుల సురేష్,లగిసెట్టి సాగర్,కిషన్,తిరుపతి,లత,వందన,మాధవి తదితరులు పాల్గోన్నారు