టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను అంచలంచలుగా పూర్తి చేస్తుంది- వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా దేవి
2 వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం, వివేకానంద నగర్ డివిజన్, వెంకటేశ్వర నగర్లోని సాగర్ సంగం కమ్యూనిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి, మాజీ కార్పొరేటర్ రంగారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి 100 రోజులు కంటిన్యూగా ప్రజలకు చెకప్ చేస్తూ వారికి కావలసిన కళ్ళజోడులు అందజేయనున్నట్టు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయినేని చంద్రకాంత్,హరినాద్, ఎర్ర లక్ష్మయ్య, ఆంజనేయులు, సాగర్ సంగం అధ్యక్షులు దయాసాగర్, మహిళ నాయకురాలు స్వరూపా, శ్రావణి రెడ్డి, కవిత, తదితరులు పాల్గొన్నారు.