సమాజంలో నిరాధారణకు గురవుతున్న మహిళలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలీ -ఆర్ కృష్ణయ్య
సమాజంలో సామాజిక వివక్షతకు గురవుతూ సమాజంలో నిరాధారణకు గురవుతున్న మహిళలకు రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే మహిళలకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుందని ఆర్ కృష్ణయ్య అన్నారు.అంబర్పేటలో బిసి మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారద గౌడ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో నిరాధారణకు గురవుతున్న బలహీనవర్గాలకు చెందిన మహిళలకు రాజ్యాధికారంలో అవకాశాలు కల్పించినప్పుడు మహిళా సాధికారత ఏర్పడుతుందన్నారు.మహిళల కోసం ప్రస్తుతం ప్రవేశ పెట్టిన మహిళా బిల్లులో కేవలం అసెంబ్లీ పార్లమెంట్ లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అలా కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అనే అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారత ఏర్పడుతుందని అన్నారు. గత మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మహిళా బిల్లు శాతం పెంచి సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.