నకిరేకల్ ప్రాంతంలో తెల్లవారుజామున పిడుగులు, వర్షం బీభత్సం

Share this:

నకిరేకల్(V3News)04-05-2022: నకిరేకల్ ప్రాంతంలో తెల్లవారుజామున పిడుగులు, వర్షం బీభత్సం సృష్టించాయి.మోదీని గూడెం గ్రామంలో గొర్రెల మంద వద్ద నిద్రిస్తున్న పగడాల లింగరాజు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. బండిపాలెం గ్రామంలో తాటి చెట్ల పై పిడుగులు పడి దగ్ధమయ్యాయి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.కేతేపల్లి గ్రామంలో వర్షం గాలికి ఇంటి పైకప్పు రేకులు తగిలి టిఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి వీరారెడ్డి మృతిచెందాడు. ఒక్కసారిగా పిడుగులు వర్షం ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మోదినిగూడెం గ్రామానికి చేరుకొని పిడుగుపాటుకు గురై చనిపోయిన లింగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించారు. కేతపల్లి లో మరణించిన వీరారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు

Leave a Reply