టిబెటన్ వింటర్ మార్కెట్ ప్రారంభించిన టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి

Share this:

హన్మకొండ అశోక హోటల్ ముందు గల మున్సిపల్ గ్రౌండ్లో టిబెటన్లు ఏర్పాటు చేసిన టిబెటన్ వింటర్ మార్కెట్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి,పిసిసి సెక్రెటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి,పిసిసి సెక్రెటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చలికాలంలో చలిని తట్టుకునేందుకు హన్మకొండ నగర ప్రజలకు విక్రయించేందుకు బ్రతుకు తెరువు కోసం వచ్చిన
టిబెటియన్లు తయారు చేసిన స్వేట్టర్లు,రగ్గులు,జాకెట్లు,శాలువలు అన్ని వయస్సుల వారికి నాణ్యమైనవి,సరసమైన ధరల్లో లభిస్తాయని,ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు టిబెటిన్ వింటర్ మార్కెట్లో స్వేట్టర్లు కొనుగోలు చేసి చలినుండి రక్షించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ 8 వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మీ రాణి కుమారి,పిసిసి సెక్రెటరీ,టిబెటిన్ రెఫెగి వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జాఫర్,టిబెటిన్ రెఫెగి స్వేట్టర్స్ సెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగ్పా లక్పా, టెరింగ్ దోల్మా,బుట్టి,టిబెటియన్లు పాల్గొన్నారు.