కేంద్ర ప్రభుత్వం పాలపై మరియు పాల ఉత్పత్తులపై పెంచిన GSTని తక్షణమే తగ్గించాలి-నోముల భగత్ , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే

Share this:

త్రిపురారం(V3News) 20-07-2022: త్రిపురారం మండల కేంద్రం లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి పిలుపు మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పాలపై మరియు పాల ఉత్పత్తులపై పెంచిన 5శాతం GSTని తక్షణమే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పాడేతో , దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మరియు జిల్లా టిఆర్ఎస్ నాయకులు మర్ల చంద్రారెడ్డి మరియు మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల పై జిఎస్టి రూపంలో సామాన్య మానవుని ఇబ్బంది పాలు చేస్తున్నారని ఇది తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం టిఆర్ఎస్ నాయకులు మర్ల చంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో త్రిపురారం మండల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు, పాల ఉత్పత్తి రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply