తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నది- అంతర్గాం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ

Share this:

అంతర్గాం(V3News) 06-05-2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నదని అంతర్గాం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంతర్గాం టీటీఎస్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముర్మూర్ గ్రామంలో పాఠశాల, పొట్యాల గ్రామ పాఠశాల మరమ్మత్తుల కోసం రాష్ట్ర మంత్రివర్యులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ల సహకారంతో సుమారు 20లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని రామగుండం శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆదేశానుసారం గురువారం పాఠశాలల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ZPTC ఆముల నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పరిజ్ఞానం కలిగి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు మెరుగైన, నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో భావిభారత పౌరులుగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ, గ్రామాల సర్పంచ్లు బాదరవేణి స్వామి, కుర్ర వెంకటమ్మ నూకరాజు, ఎదులాపురం నీరజ వెంకటేష్, మండల ప్రజా ప్రతినిధులు, MPDO భూక్యా యాదగిరి నాయక్, MEO దాసరి లక్ష్మి, SMC చైర్ పర్సన్ శారద, AE రాజు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొనగా ముర్మూర్ పాఠశాల హెచ్ఎం.రవిందర్ రావు కార్యక్రమ సమన్వయకర్త గా వ్యవహరించారు.

Leave a Reply