16027 ఉద్యోగాలకు తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక ప్రకటన
Share this:
హైదరాబాద్(V3News) 25-04-2022: తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఐ పోస్టులు 414 , సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. www.tslprb.in వెబ్‌లో సైట్ దరఖాస్తు చేసుకోవచ్చు.

