ఆర్టీసీ బస్సు కారు ఢీ..

Share this:

ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుండి భద్రాచలం వస్తున్న నేపథ్యంలో బూర్గంపాడు మండల పరిధిలోని గౌతాపురం సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన సంఘటన లో పశువులు కాపురికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది… బూర్గంపాడు మండల పరిధిలోని గౌతాపురం ఏరియాలో వై రామకృష్ణ అనే వ్యక్తి తన కొత్త కారును పెద్దమ్మ తల్లి గుడి వద్ద పూజలు చేసుకుని తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుకోకుండా సడన్గా వెనుక నుంచి వేగంగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు కొంత డ్యామేజీ గురి అయింది పశువులు కాపరికి స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు గాయపడిన పశువులు కాపరినీవెంటనే ఆసుపత్రికి తరలించారు… విషయం తెలుసుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి గల కారణాలు, వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .ఈ ప్రమాదానికి గల కారణాలు అతివేగం వల్ల సంభవించిందా రోడ్డు సరిగా లేకపోవడం వల్ల జరిగిందా పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది