పశువుల కాపరి ని పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు

Share this:

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ పశువుల కాపరి పూనం, అను. శుక్రవారం పశువులను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి నందుకు ఆయనను అటవీ అధికారులు ఆరుగురు కలిసి చితకబాదిన సంఘటన అందరికీ తెలిసినదే ,ఆయన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజుల నుండి చికిత్స పొందుతున్నారు .ఇది తెలిసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గే డ్డం గణేష్ నిర్మల్ అధ్యక్షులు పొందూరు మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాబురావు ,ఆదివాసి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పుష్ప రాణి. జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్ర శ్యామ్ రావు ,సమన్వయకర్త పెందూర్ ప్రభాకర్ ,లు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశువుల కాపరి పరామర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమాయకుడైన ఆదివాసి ని విచక్షణ రహితంగా ఆరుగురు అటవీ అధికారులు కలిసి చితకబాదడం హేయమైన చర్య అని అన్నారు .దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై అట్రాసిటీ కేసులు నమోదు ఉద్యోగం నుండి తొలగించు చేయాలని డిమాండ్ చేశారు .గత మూడు రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పోలీస్ ,అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు పరామర్శించే లేదు అని డిమాండ్ చేస్తున్నామన్నారు. రోజురోజుకు అటవీశాఖ అధికారులు ఆదివాసీలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నారన్నారు. వెంటనే ఈ దాడులను ఆప నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేశారు అనంతరం ఆదివాసీలు జిందాబాద్ తుడుందెబ్బ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply