అక్రమాల ఆర్డీఓపై తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆందోళన

Share this:

ఆసిఫాబాద్‌(v3News) 30-08-2022); అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొమురం భీం జిల్లా ఆర్డీఓ పై విచారణ జరిపించి ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటు డిమాండ్ చేస్తు తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆసిఫాబాద్‌ ప్రదాన రోడ్డుపై 5 గంటల పాటు బారీగా రాస్తారోకో నిర్వహించారు. దింతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎర్పడింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్ విజయ్ మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో వాంకిడి బార్డర్ గోయగామ్ ఆదివాసీల భూములకు వచ్చిన పరిహారాన్ని ఫారెస్ట్ అధికారులకు ఇప్పించారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకం నిధుల దుర్వినియోగంలో ఆర్డీఓ హస్తం ఉందన్నారు. కెరమెరి మండలం అంబారావుగూడలో 4 ఎకరాల భూమిని బినామీల పేరుతో 14 ఎకరాల పట్టా చేశారని విమర్శలు చేశారు. కొందరి భూములలో వివాదాలు సృష్టించి ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేస్తు ముడుపులు దండుకొని చేతులు దులుపు కుంటున్నరని ఆరోపించారు. ఓ రాజకీయ నాయకుని నుండి డబ్బులు తీసుకొని నిబంధనలను తుంగలో తొక్కి ORC జారీ చేశారన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ 163 సర్వే నెంబర్ లో ఓ బిల్డర్ తో చేతులు కలిపి లే అవుట్ లేకుండా ఫ్లాట్లా నాలాకు అనుమతిచ్చి ప్రభుత్వ ఆధాయానికి గండి కొట్టారన్నారు. పలు అక్రమాలకు ఆర్డీఓ పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం చాలా బాధకరమన్నారు. కలెక్టర్ వచ్చెదాక కదలమంటు రోడ్డు బీష్మించి కూర్చున్నారు. DRO కదం సురేష్ వచ్చి ఆదివాసీ ఆందోళనకారులతో మాట్లాడి వినతి పత్రం స్వీకరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపించేలా చూస్తమని తెలపడంతో ఆందోళన విరమించారు.
బైట్: కొట్నాక్ విజయ్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు