కాంటెస్టేడ్ అభ్యర్థి అల్ల దేవేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుకు ఘన సన్మానం
హసన్ పర్తి మండలం సూదన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మంగళవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా సూదన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాంటెస్టేడ్ అభ్యర్థి అల్ల దేవేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేఆర్. నాగరాజును ఘనంగా సన్మానించారు.అనంతరం నోట్ పుస్తకాలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఆకారపు రాజు,గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడపాక నరేష్,గట్టు వెంకటేష్ బోడ ప్రశాంత్,రావుల సందీప్
రావుల సందీప్,కోడపాక రాజరత్నం,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.