గౌడ్ కులస్తులు ఏకం కావాలి

Share this:

డోర్నకల్(V3News) 16-09-2022: మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం మండల మహసభ కేజీకేఎస్, డోర్నకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ,ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం కార్యదర్శి మేకపోతల రమణ, మరియు రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, కల్లుగీత గీత కార్మికులు అందరూ ఒక్కటిగా కలిసి కట్టుగా పోరాటం చేసి మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఒంటి చేతితో గోల్కొండ కోటను కొట్టిన సర్వాయి సర్దార్ పాపన్న చరిత్ర చూసి అందరూ ఒక్కటే గా, పోరాటం చేయాలని రాష్ట్రంలో తక్కువ శాతం ఓటు ఉన్న కులస్తులు రాష్ట్రంలో ముందుకు పోతున్నారు అని ఎక్కువ శాతం ఓటు బ్యాంకు ఉన్నది గౌడ్ కులస్తులు దిగజారిపోతున్నారు అని గౌడ్ కులస్తులు అందరూ కలిసి మెలిసి ఉంటే మన హక్కులు మనమే సాందించుకుంటామని ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా అధ్యక్షులు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్ , జెడ్పిటిసి కమల రామనాథం, మేకపోతుల రమ్య శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ,బోయినపల్లి వెంకన్న సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు,గంధంసిరి ఉపేందర్ మాజీ సర్పంచ్, కల్లుగీత కార్మిక సంఘం డోర్నకల్ మండల కార్యదర్శి గాదె నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు మండలంలోని అన్ని గ్రామాల సొసైటీ ప్రెసిడెంట్లు , మధు అంజయ్య రెడ్డి మల్ల శ్రీనివాస్ వెంకన్న లాలయ్య సత్యం అంజయ్య గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.