సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు చౌరస్తా వద్ద వాహనదారులకు తప్పని ఇక్కట్లు -V3 న్యూస్ ప్రచురించిన కథనంకి స్పందన

Share this:

  • స్పందించిన అధికారులు
  • మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజానీకం

సూర్యాపేట( V3News)07-04-2022: పలు సామాజిక మాధ్యమాల ద్వారా పలు వార్తా పత్రికల ద్వారా పోస్ట్ ఆఫీస్ నుండి ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనచోదకులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నరుని అదే విదంగా ఈ కోర్టు ముందు గల వెంకటేశ్వర స్వామి గుడికి పోయే రహదారి మూసి వేయడంతో వన్ వే కావడంతో నిత్యం వాహన చోదకులు ప్రమాదల బారిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా తక్షణమే స్పందించిన మంత్రి ప్రభుత్వ యంత్రాంగన్నీ కదలించి రోడ్డు వెడల్పు పనులు,కల్వర్టు పనులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అధికారులు వెంటనే రోడ్డు పనులు ముమ్మరం చేసి వాహనచోదకులకు ఇబ్బంది కలక్కుండా కోర్టు చౌరస్తా వద్ద వెంకటేశ్వర స్వామి రోడ్డు వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి చేశారు.సమస్యని మంత్రి దృష్టికి తీసుకుపోగా ప్రజా అవసరాల మేరకు పని చేస్తున్న ప్రజా మంత్రిని ప్రజానీకం అభినందించి,V3 న్యూస్ కు ధన్యవాదాలు తెలియజేసారు..

Leave a Reply