ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

Share this:

మండల కేంద్రమైన ముధోల్లోని కోలీగల్లీలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ముదిరాజ్ సంఘం సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవంగా భావించే రామాయణాన్ని రచించిన గొప్ప మహనీయుడు వాల్మీకి మహర్షి అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ హిందూ సమాజమంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపిటిసి సభ్యుడు దేవోజి భూమేష్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేష్, హిందూ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, అధ్యక్షులు అనిల్, ఉప అధ్యక్షులు గడ్డం సుభాష్,ప్రధాన కార్యదర్శ టి. రమేష్, సంయుక్త కార్యదర్శి జంబుల సాయిప్రసాద్, మాజీ ఎంపిటిసి పోతన్న యాదవ్, సంఘం అధ్యక్షుడు బాబు, సభ్యులు సోమేశ్ పటేల్, కోరి పోతన్న, జీవన్, సపటోళ్ల పోతన్న, ముదిరాజ్ సంఘం సభ్యులు, వాల్మీకి యూత్ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు