సంస్థాన్ నారాయణపురంలో MPP భర్త గ్రామ కంఠం భూమి ఆక్రమణ-అఖిల పక్షం నిరసన-ఉద్రిక్తత

Share this:

సంస్థాన్ నారాయణపురం(V3news)23-05-2022 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బస్ స్టాండ్ కోసం 675 గజాల గ్రామకంఠం భూమిని వుంచగా దానిని అధికార పార్టీ ఎంపీపీ భర్త కబ్జా చేశారని ఆరోపిస్తున్న గ్రామస్తులు అఖిల పక్షం నాయకుల అధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసి ,అనంతరం సర్పంచ్ తో కలిసి కబ్జా చేసిన స్థలం లో వేసిన ఇనుప కంచెను, కడిలను తొలగించిన గ్రామ పంచాయతీ సిబ్బంది, భారీగా గ్రామస్తులు రావడం తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు,దీంతో గ్రామస్థులకు పోలీసులకు వాగ్వాదం.

సర్పంచ్ సికిల మెట్ల శ్రీహరి మాట్లాడుతూ : గ్రామ కంఠం భూమిని గ్రామ అవసరాల మేరకు ఉపయోగించాల్సి ఉండగా కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే పెన్సింగ్ వేసి కడీలు నాటి తమ భూమి అని చెప్పుకుంటూ కబ్జా చేశారని గ్రామస్థులు మరియు అఖిలపక్ష నాయకుల ఫిర్యాదు మేరకు అఖిలపక్షంతో చర్చించి గ్రామ పంచాయతీ సిబ్బంది తో అక్రమ స్థలాన్ని తొలగించడం జరిగింది, గ్రామ కంఠం భూములు ఏ రికార్డులో ఉండకపోవడానికి అదునుగా చేసుకొని కొందరు అక్రమార్కులు వేరే సర్వే నెంబర్లు, ఇంటి నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి మా వద్ద పత్రాలు ఉన్నాయని చెప్పి పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు అని ఇటువంటి వారి పై చర్యలు తీసుకోవాలని తెలిపిన సర్పంచ్ శ్రీహరి

ఎంపీపీ భర్త గుత్తా ప్రేమ చందర్ రెడ్డి మాట్లాడుతూ : 1961లో కాసిం రాణి రాజు వాళ్ళ సంబంధించిన 678 భూమిని వారి తర్వాత మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ శిష్యులైన వారు తీసుకున్నారు వారి నుండి నేను నాకు సొంత భవనం లేదని 2016లో తీసుకున్నాను దానికి సంబంధించిన ఐదు పర్యాయాలు గా లింక్ డాక్ మెంట్స్ ఉన్నాయని ఇల్లు కట్టుకోవాలని 300 గజాల లో నేను గ్రామ పంచాయతీకి అప్లికేషన్ చేసుకోగా దానిని సర్పంచ్ వ్యక్తిగతంగా తీసుకొని నాకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అని,అలాగే సైటు కు సంబంధించిన పూర్తి వివరాలు పేపర్లు పంచాయతీ కార్యదర్శి అన్ని నేను ఇచ్చాను కానీ దానిని సర్పంచ్ సికీల మెట్ల శ్రీహరి వ్యక్తిగతంగా తీసుకొని కక్షపూరితంగా కావాలనుకుని మా సైట్ పై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు అని, వీరిపై కలెక్టర్ ,RDO ,పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

S i యుగెందర్ మాట్లాడుతూ: 12 గంటల సమయంలో సుమారు రెండు,మూడు వంద జనాలతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కూల్చి వేస్తుండడంతో సివిల్ పంచాయతీలు పోలీసులు ఉండకుండా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ వున్న గ్రామపంచాయతీ దగ్గర చూపించి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలని మేము తెలిపాము .

Leave a Reply