వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Share this:

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు గత 12 రోజులుగా నిరవధిక దీక్ష చేపడుతున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని vra jac dist vice chairman తీవ్రంగా మండిపడ్డారు. శుక్ర వారం నాడు వీఆర్ఏల దీక్షకు తమ సంఘం తరపున పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 119 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీ సాక్షిగా
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహి స్తుందని ఆయన మండిపడ్డారు. తమకు సాధ్యం కాని హామీలు ఇస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చాలీచాలని వేతనాలతో రాత్రి పగలు తేడా లేకుండా వీఆర్ఏల చేత వెట్టి చాకిరి చేయిస్తూ వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నిరవధిక దీక్ష చేపట్టి 11 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారన్నారు తమకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఈ దీక్షలను కొనసాగించాలని అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే వీఆర్ఏ ల ను ఏకం చేసి హైదరాబాదులోని సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు

Leave a Reply