రైతుల కడుపు కొడుతున్న చెరువు కాంట్రాక్టర్లు

Share this:

కేతపల్లి గ్రామంలో చేపల కోసం చెరువు నీటిని ఖాళీ చేస్తున్న వైనం
చాపల కోసం చెరువు నీటిని తోడేస్తున్న వేలం పాడిన కాంట్రాక్టర్లు

కేతపల్లి(v3News)30-04-2022: కేతపల్లి లో నిర్మలమ్మ చెరువులో గత ఏడాది మత్స్యశాఖ అధికారులు వేలం వేసినప్పుడు స్థానికంగా ఉన్న వారు 1.81లక్షలకు దక్కించుకున్న వారికి గత మూడేళ్లుగా చెరువు నిం డు కుండ లాగా మారటంతో వారికి చేపలు పట్టడం వీలు కాలేదు ఉన్న గడువు జూన్ 30 వరకు ముగుస్తుండటంతో ఏమి చేయాలో తోచని స్థితిలో స్వయంగా వేలం పడిన వ్యక్తులు చెరువు చుట్టూ2 ఇంచులు పైపులు కొన్ని చోట్ల మోటర్లు మరి కొన్ని చోట్ల గాలి పైపులు తో నీటిని అలుగు ప్రాంతం నుండి బయటకు పంపుతున్న పట్టించుకోని అధికారులు ఒకపక్క ప్రభుత్వం వారు మిషన్ కాకతీయ పేరుతో చెరువులు నింపుతూ ఉంటే మరోపక్క చేపల పేరుతో నీటిని అనధికారికంగా తోడేస్తున్నారు మరో 45 రోజులు ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు పండించుకోవడానికి చెరువులో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపిస్తారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు…

Leave a Reply