యువత క్రీడలను ఫ్యాషన్ గా కాకుండా కెరియర్ గా మార్చుకోవాలి-ఎస్పీ రాహుల్ హెగ్డే

Share this:

ముస్తాబాద్(V3News) 31-08-2022: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు. ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డి, వాలిబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ లలో గెలుపొందిన టీమ్స్ కి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజాప్రతినిధుల తో కలసి బహుమతులు అందజేసారు విజేతలుగా వాలీబాల్ లో ప్రథమ బహుమతి సిరిసిల్ల పోలీస్ టీమ్ ద్వితీయ బహుమతి గంభీరావుపేట్ పోలీస్ టీములు నిల్వగా కబడ్డీలో ప్రథమ బహుమతి చెక్కపల్లి టీం ద్వితీయ బహుమతి అనుపురం టీములు నిలిచాయి విజేతలకు ప్రథమ బహుమతిగా 15 వేల రూపాయల నగదు తో పాటు కప్పును భహుకరించగా ద్వితీయ బహుమతిగా10 వేలు రూపాయల నగదు తో పాటు కప్పును బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఏ ఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం అని చివరి వరకు పోరాడాలి అన్నారు. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు.యువత క్రీడలను ఫ్యాషన్ గా కాకుండా కెరియర్ గా మార్చుకోవాలన్నారు,నిరుద్యోగ యువతకు పోలీస్ రిక్రూట్మెంట్ లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా భవిష్యత్తు లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం అన్నారు.ఇక్కడ కి వచ్చిన క్రీడాకారులు మంచి ప్రతిభ చూపించారన్నారు. భవిష్యత్తు లో సీనియర్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఆడాలని అన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువు ,క్రీడలపై దృష్టి సారించాలనీ క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికి* దోహదపడుతాయన్నారు,గ్రామీణ క్రీడలను ప్రోత్సహించిన గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ను ఎస్పీ రాహుల్ హెగ్డే సన్మానించారు అలాగే ఎస్పీకి మెమెంటో ఇచ్చి సర్పంచ్ వనజ గోపాలరావు శాలువాతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో , జడ్పీటీసీ గుండం నర్సయ్య, రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ ఏఎంసీ చైర్మన్ శీలం జనాభాయ్ మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజి జిల్లా కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా,, డాక్టర్ చిoతోజు శంకర్ తెరస మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు,ప్రజాప్రతినిధులు, అధికారులు సి.ఐ ఉపేందర్ ఎస్సై వెంకటేశ్వర్లు ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు