వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 66 వ రోజు

Share this:

బూర్గంపాడు (V3News) 25-04-2022: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 66 వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో కొనసాగుతోంది.ఈరోజు ఉదయం మండలంలోని యిరవెండి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర సారపాక గ్రామం వరకు చేరుకుంది.ఇరవండి గ్రామంలో రైతు గోస దీక్ష లో రైతులతో వైయస్ షర్మిల పాల్గొన్నారు.ఇటీవల కాలంలో సారపాక లోని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య చేసుకావడంతో దుఃఖసాగరం లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ను షర్మిల పరామర్శించారు.ఈరోజు సాయంత్రం సారపాక నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతారు.యిరవేండి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు గోస కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ భూముల సమస్య పరిష్కరించాలని కేసీఆర్ కి చిత్తశుద్ది లేదనీ, పట్టాలు ఇవ్వక పోగా ఉన్న వాటికి లాక్కున్నారు అన్నారు.
రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నారు.
రుణమాఫీ అని చెప్పి ఎంత మందికి రుణాలు మాఫీ చేశారు కేసీఆర్ గారురుణాలు మాఫీ చేస్తే కదా..కొత్తగా బ్యాంకులు రుణాలు ఇచ్చేది
వరి రైతులకు కేసీఆర్ నిండా మోసం చేశారు తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారు
తప్పు కేసీఆర్ చేస్తే ఈ రోజు శిక్ష రైతులకు పడింది
17 లక్షల ఎకరాల్లో వరి వేయని రైతుకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలి. 35 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని సైతం కొనడం లేదు
8 వేల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి వెయ్యి కూడా తెరవలేదు కేసీఆర్ రైతులను ఏ రకంగా ఆదుకున్నారో ఒక్కటి చూపించాలి అన్నారు.

రైతులను ఆదుకొని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది

కౌలు రైతుకు వ్యవసాయం తప్పా మరొకటి తెలియదు

కౌలు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

రైతు కూలీలకు..వారి జీవితాలకు బరోసా లేనే లేదు

తెలంగాణ లో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు

ప్రతిపక్షాలు ప్రశ్నించక పోవడం తోనే కేసీఆర్ అరాచకాలు

కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యే లు టీఆరెఎస్ లో చేరుతున్నారు

-. ప్రతిపక్షాలు భాధ్యత మరిచిపోవడం తోనే పార్టీ పెట్టా

-. వైఎస్సార్ సుపరిపాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ

-. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే వైఎస్సార్ బిడ్డ గా పని చేస్తానని మాట ఇస్తున్న అన్నారు.

Leave a Reply