ఎస్పీ చెప్పిన కేసు కట్టని అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణ రెడ్డినాకు ప్రాణహాని ఉందని మీడియాను ఆశ్రయించిన దాదా పీర్
అనంతపురం అర్బన్ విబి విరాజ్ బిల్డర్స్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ మీడియాకు తెలియచేసిన దాదా పీర్ 21 ఆదివారం విబి విరాజ్ బిల్డర్స్ వారు ఇంటెల్ కాలేజ్ దెగ్గర వున్న తన ఓనర్ అయినటువంటి శ్రీకాంత్ సైట్ లోకి వచ్చి ఫ్లాట్లు అమ్ముతుంటే ఓనర్ తో మాట్లాడుకోమని చెప్పినందుకు వాంటెడ్ గా చేసి చంపేందుకు ప్రయత్నించారని తల మీద బలమైన గాయం తగిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కేస్ అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన దాదా పీర్ బుధవారం అర్జీ డిఎస్పి కి చేరడంతో డిఎస్పి ఆఫీసు నుండి పిలుపు వచ్చింది అని తెలియజేశారు. డిఎస్పీ ఆఫీస్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ కి అర్జీ పంపించిన సిఐ చెప్పింది రాసుకున్నారు కానీ కేసు కట్టలేదని దాదా పీర్ మీడియా ముఖంగా తెలియజేశారు.తనకు ప్రాణహాని ఉందంటూ తనకేం జరిగినా విబి విరాజ్ బిల్డర్స్ భానుమూర్తి సోమశేఖర్ సునీత బాధ్యులని మీడియా ముఖంగా తెలియజేశారు.