గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం..
గుడిపల్లి మండలంలోని గుడికొత్తురు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ, వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తోంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో, గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జంతుబలులీచ్చి మోక్కలు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖసంతోషాలతో ఉండాలని, పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామదేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లల్లోకి వెళ్తారని తెలిపారు.