సంక్షేమ ప్రదాత సీఎం జగనన్న: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
- సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రదాతగా చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం ఎస్ఆర్ఐటి కళాశాలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీ బాల హాజరయ్యారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా చేశారన్నారు. గతంలో నియోజకవర్గంలో నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి ప్రతి చెరువుకు నీటిని అందిస్తున్నామన్నారు. శింగనమలలో 2024లో ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నకు బర్త్ డే గిఫ్ట్ గా అందిస్తామన్నారు.
430 మంది రక్త దానం
రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు,అభిమానులు దాదాపుగా 430 మంది రక్త దానం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, మండలాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.