అంగరంగ వైభవంగా వంగ పహాడ్ పునరుత్దాన బాప్టిస్ట్ చర్చి రోమన్ క్యాథలిక్ చర్చి లో క్రిస్మస్ సంబరాలు.. పాస్టర్ రెవ టీడీ.పాల్సన్ ఫాదర్ చిన్నపరెడ్డి
గ్రేటర్ వరంగల్ 2 వ డివిజన్ హసన్ పర్తి మండలం వంగ పహాడ్ గ్రామంలోని పునరుత్దాన బాప్టిస్ట్ చర్చి రోమన్ క్యాథలిక్ చర్చి లో ఆదివారం క్రిస్మస్ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు పాస్టర్ రెవ టీడీ.పాల్సన్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ
క్రైస్తవుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.అనంతరం పాస్టర్ రెవ టీడీ.పాల్సన్,చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజును పాస్టర్ పాల్సన్ ఫాదర్ చిన్నపరెడ్డి శాలువలతో,పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పొన్నాల రఘు, పొన్నాల రాజేందర్ పునరుత్దాన బాప్టిస్ట్ చర్చి రోమన్ క్యాథలిక్ స్త్రీల సమాజం, యవ్వన సమాజం,క్రైస్తవ సంగస్తులందరూ పాల్గొన్నారు.