ఘనంగా అమ్మవారికి జయంతి ఉత్సవాలు
మెట్ పల్లి మే18: పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో జయంతి ఉత్సవాలు శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాలు భాస్కర శర్మ, బాలకృష్ణ శర్మ, మనోహర శర్మ,రాజేంద్ర శర్మ, ఉపేంద్ర శర్మ, ఆదిత్య శర్మ లు , వేద పండితులు పూజలు నిర్వహించారు.
పూజ కార్యక్రమంలో భాగంగా మహా చండీయాగం, మహిళా మణులతో సామూహిక కుంకుమార్చనలు, పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పూల, తమలపాకుల, తామర పువ్వుల శంకుల, గంగాలo దీపాలు, గవ్వల, గురు గింజల, , చంకీల ముత్యాల గోమేదిక చక్రాల , గాజుల గంధం వెండి నాణాల, వివిధ రకాల హారతులతో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి పుణ్యాహవాచన-గణపతి పూజ నవగ్రహ పూజ, ,
కుంకుమార్చన, మంగళహారతి, మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు రాంబాబు, ర్యాగెల శ్రీను, చకినం కేదార్నాథ్, చాడ సురేష్ కోట సుమన్ వెలగందుల తిరుపతి,ఎల్మి రవి,చిట్టీమెల్లి శ్రీనివాస్,బండారి మారుతి,పిప్పరి నవీన్, అమర్, ఆర్య వైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.