అనంతసాగర్ లో జరిగిన వృద్ధుని ఆత్మహత్యవిషయమై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి
సీనియర్ సిటిజన్స్ వెల్పేర్ అసోసియేషన్ సంస్థ గోపాలపురం, హనుమకొండ అధ్వర్యంలో హసన్ పర్తి మండలం, అనంతసాగర్ గ్రామానికి వెళ్లడంజరిగింది. గ్రామంలో జూలై 1న మెట్టే బొందయ్య అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆవార్త కొంత ఆలస్యంగా జూలై 10న పత్రికలో వెలుగుచుడండం జరిగింది. సందర్భంగా మా సంస్థ అధ్యక్షులు దామెర నర్సయ్య (రిటైర్డ్ డి.ఎస్.పి) గారి అధ్వర్యంలో నిజనిర్దారనకోసం కమిటీగా వెళ్ళడం జరిగింది, మెట్టే బొందయ్య (90) గారికి ఇద్దరు కుమారులు ఉనారు. వారెవరూ పట్టించుకోకపోవడంతో అనాధగా వెల్లదీస్తూ విసిగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికున్న 8ఎకరాల ఆస్తిని ఇద్దరు కొడుకులు పంచుకుని, కనీసం అన్నంకూడా పెట్టకుండా హింసిస్తున్నారని ఎవరికి మొరపెట్టుకున్నా చివరికి గ్రీవెన్ సెల్ లో జూన్ 24న జిల్లాకలెక్టర్ హనుమకొండ గారికి, పిటిషన్ ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషన్ లో తెలిపారు. పైగా తనను బావిలోపడి లేదా మందుతాగి చనిపొమ్మని తన కొడుకులు అన్నారని కలెక్టర్ గారికి ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పత్రికలో వచ్చిన ఈ విషయాలను చూసి ఈ విషయమై మా సంస్థ కమిటీ సభ్యులు నిజనిర్ధారణకోసం గ్రామానికి వెళ్ళగా మెట్టే బొందయ్య తానే స్వయంగా వండుకుని తినేవాడని, ఆత్మగౌరవం కలవాడని స్టానికులు అన్నారు. అతని సమస్యలను జూన్ 24 నకలెక్టర్ గారికి రాతపూర్వకంగా విన్నవించినా ఎలాంటి స్పందనలేకపోవడంతోనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడని మాకమిటీ దృష్టికివచ్చింది. అతని ఆత్మహత్యకూడా అనుమానాస్పదంగానే ఉన్నది. పోలీస్ ఎంక్వయిరీలో మరియు పోస్ట్ మార్టం లో మరిన్నివిషయాలు తెలిసే అవకాశమున్నది. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే అతను ఇట్టి అఘాయిత్యనికి పాల్పడేవాడుకాదని మాకమిటీ అభిప్రాయపడినది. సంఘటన జరిగిన ఇంట్లోనే కమిటీ మెట్టే బొందయ్య గారి పెద్ద కుమారుడు, కోడలుతో చుట్టుపక్కల వారితో మాట్లాడడం జరిగింది. దయచేసి సంబంధిత జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై నిజనిర్ధారణ చేసి దొషులపై కఠినచర్యలు తీసుకోగలరని భవిష్యత్తులో వయోవృద్ధుల పిటిషన్లపై సకాలంలో స్పందించి ఇలాంటి అఘాయిత్యాలు పునారావృతం కాకుండా చూడాలని కోరుచున్నాము. 2007 తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టంప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ పర్ధిలో “వృద్ధ మిత్ర” స్వచ్చందకమిటీలు ఏర్పాటుచేస్తే ఇలాంటి సంఘటనలను కొంతైనా అరికట్టే అవకాశం ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా మెట్టే బొందయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కమిటీలో తేరాల యుగంధర్, గోకారపు రాజేందర్, మార్క రవీందర్, పప్పుల రమేష్, మూల ఆయిలయ్య, నిగ్గుల ప్రసాద్, కుక్కల సమ్మయ్య, ముచ్చ సాంబయ్య, నిగ్గుల సాంబయ్య, గోపరబోయిన రాజు మరియు చుట్టుపక్కల స్థానికులు పాల్గొన్నారు.