ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కన్నులపండువగా కొనసాగుతున్నది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారివారి శేష వస్త్రం అందించారు.