తాయో సీడ్స్ వారి రెడ్ హాట్ రైతు క్షేత్ర ప్రదర్శన
కురవి, డిసెంబర్ 5,:తాయో సీడ్స్ వారి రెడ్ హాట్ హైబ్రిడ్ మిరప అత్యధిక దిగుబడునిస్తుందని కంపెనీ ప్రతినిధి ఆర్ఎం యం వేణుగోపాలరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హరిదాస్ తండా గ్రామ పరిధిలోని హార్య తండా శివారులో రైతు ధరావత్ బిక్షం తను సాగు చేస్తున్న రెండు ఎకరాల మిరప తోటలో రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రెడ్ హాట్ హైబ్రిడ్ సన్నరకం మిరపను ప్రజలు క్షేత్రాన్ని చూడడానికి చుట్టుప్రకాలాల నుండి సుమారు 20 గ్రామాల నుండి 400 పైగా రైతులు మిరప తోట ని సందర్శించి సంతోషాన్ని వ్యక్తం పరిచారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రస్తుత క్లిష్ట వాతావరణ పరిస్థితులను తట్టుకొని కొమ్మఎండు, వేరు కుళ్ళు, తెగుళ్లను తట్టుకొని ఎలాంటి మూడుతా, వైరస్ కానీ లేకుండా మిరప చేను అధిక కాపును కలిగి ఉంది అని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదే విధంగా టిఎస్ఎం చెన్నా శ్రీధర్ మాట్లాడుతూ తయో సీడ్స్ వారి ఎఫ్1- హైబ్రిడ్ మిరపరకం రెడ్ హాట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుబ్బ,నల్లి, పలు రకాల తెగులను తట్టుకొని ఎకరానికి 35 క్వింటాల దిగుబడును అందిస్తుందని, ఈ రకం సీడ్స్ వేసుకోవడం వల్ల రైతులకు మేలుకు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ ధరావత్ రమేష్, డిస్ట్రిబ్యూటర్ మహేందర్, రైతు మిత్ర సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ ప్రతినిధి భూక్యా శ్రీను, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.