Telangana

పల్లెదవ ఖానాలలో సమయపాలన పాటించని వైద్య సిబ్బంది

…11 గంటలైనా విధులకు హాజరు కాని వైనం…
….. చింతపల్లి మండలం గడియ గౌరారం, కురంపల్లి లో ఘటన…
…. అగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు…

చింతపల్లి. : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె దవఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవఖానాలుగా గుర్తించి వైద్యుడితో పాటు స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం సహాయ సిబ్బందిని నియమించి వారి ద్వారా గ్రామీణులకు సేవలందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పల్లెల్లో అన్ని రకాల వైద్య సేవలలు అందుబాటులోకి తీసుకురావాలనేది వీటి లక్ష్యం కాగా ప్రస్తుతం లక్ష్యం చేరేలా కనిపించడం లేదు…పల్లె దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం కొన్ని పల్లె దవాఖానాలను ‘విశ్వంభర’ దినపత్రిక ప్రతినిధి పరిశీలించగా సకాలంలో తెరువలేదు.. పూర్తి వివరాలలోకి వెళ్తే చింతపల్లి.మండలం లోని గడియ గౌరారం పల్లె దావఖానలో ఉదయం 11గంటలైన వైద్య సిబ్బంది రాకపోవడంతో రోగులు లబోదిబోమంటున్నారు. కేవలం ఒక్క ఆశా వర్కర్ విధులకు హాజరై అన్ని తానై రోగులకు వైద్యం అందిస్తున్నారు.. పల్లె దవాఖానలో ఒక ఎంబిబిఎస్ డాక్టర్, ఏఎన్ఎం, మెడికల్ హెల్త్ అసిస్టెంట్, లు విధులకు గై హాజరైనారు.. ఇట్టి విషయంపై మండల వైద్యాధికారిని డాక్టర్ శ్రీదేవిని వివరణ కోరగా ఉదయం తొమ్మిది గంటల నుండి 4 గంటల వరకు వైద్య సిబ్బంది విధులలో ఉండాలి. లేని యెడల వారికీ జిల్లా ఉన్నతధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు…..
అదే విదంగా వీటి నగర్ పి హెచ్ సి పరిధి కురంపల్లి గ్రామంలోని పల్లె దవఖానాలు లో వైద్య సిబ్బంది తాళాలు వేసి వెళ్లారు…గత నాలుగు రోజుల నుండి పల్లెదవ ఖానా తెరవడం లేదని గ్రామస్తులు వివరించారు.. వీటి నగర్ పి హెచ్ సి వైద్యాధికారి వంశీకృష్ణను వివరణ కోరగా ఏయన్ యం సాయిరెడ్డిగూడెంలో రోగికి డ్రెస్సింగ్ చేయడానికి వెళ్లిందని తెలిపారు..కానీ పల్లె దవాఖాన తీయకుండా గత నాలుగు రోజులు అందుబాటులో ఉండడంలేదని తెలిపారు.. ఆశా వర్కర్స్, ఏయన్ యం ఎవరు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు… ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *