ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.
దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా రెండు పథకాలను అమలు చేయడం జరిగింది,1) ఆరోగ్యశ్రీ బీమా పథకం 10 లక్షల రూపాయలు, పెంపు 2) మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఈ రెండు పథకాలు అమలు చేయడం జరిగింది, మిగిలిన గ్యారెంటీ పథకాలను కూడా త్వరితగతిన అందిస్తామని అర్హులైన అయిన వారందరిని పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా పని చేస్తామన్నారు,స్వయంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అన్నారు
ఎవరైనా మిమ్మల్ని డబ్బులు వసూలు చేసినచో నేరుగా వచ్చి నన్ను కలవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,గోపాల్ దాస్ మల్లేష్,ఎంపిపి బస్వా సావిత్రి ,వైస్ఎంపీపీ కత్తులు విజయ్ కుమార్ ,డిఈ హుస్సేన్, డిపిఓ రంగా చారి,ఎంపీడీఓ ఉమా మహేశ్వర్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నాయకులు పెద్ది కృష్ణమూర్తి,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.