బాధిత కుటుంబానికి అండగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 27 వ వార్డ్ కి చెందిన పామోజు గురుమూర్తి అనారోగ్యం తో బాధపడుతూ హైదరబాద్ లోని నిమ్స్ హాస్పిటల్* లో చేరారు. వైద్యులు పరిశీలించి ఆపరేషన్ చేయాలని తెలిపారు. అంత సోమత లేకపోవడంతో వారు వార్డ్ కౌన్సిలర్ చిరివెల్ల లక్ష్మి కాంతమ్మ వెంకటేశ్వర్లు దగ్గర కి సమస్య తీసుకు వచ్చారు.. వెంటనే విషయాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దృష్టికి కౌన్సిలర్ తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించి 2,50,000 రూపాయల విలువ గల LOC మాజీ మంత్రి మంజూరు చేయించారు ఎల్ఓసి అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు మాజీమంత్రి దామోదర్ రెడ్డికి వార్డు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు ధన్యవాదములు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 27 వ వార్డ్ లో 36 లక్షల 83 వేల 300 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్ లు మరియు LOC లు అందించామని తెలిపారు.