Telangana

సకల జనుల శ్రేయస్సుకై ప్రత్యేక పూజలు చేసిన :ఎంపీ రవిచంద్ర

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో కొలువైన శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర సమేత విజయశంకర బాల కనకదుర్గాదేవి శివపంచాయతన క్షేత్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా పుణ్య దంపతులు రవిచంద్ర -విజయలక్మీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ సిబ్బంది, పూజారులు వీరికి మహా కలశం, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు,ఆ తర్వాత శివ పార్వతుల కళ్యాణం జరిపించారు,స్వామి వారికి పూలమాల, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు మాతృశ్రీ యోగినీమాత ఆశీస్సులు తీసుకున్నారు,వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *