స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు
వరంగల్ v3 న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వరంగల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ లో కేక్ కట్ చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ మహిళా ఎంప్లాయిస్ కు చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ వేడుకలు తిలకించేందుకు విచ్చేసిన సందర్శకులకు మజ్జిగ ప్యాకెట్లు , స్వీట్లు, వాటర్ బాటిల్స్ సరఫరా చేశారు. ఈ కార్యక్రమం లో వివేక్ చంద్ర జైస్వాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవో వరంగల్ , వై రఘునాథ్ , రీజినల్ మేనేజర్ వరంగల్ అర్బన్ మరియు , కె రాజేంద్ర కుమార్ , అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాస్మేక్, జి శంకర్రావు మేనేజర్ ఎన్పీఏ , సతీష్ , అసిస్టెంట్ జనరల్ మేనేజర్ , భీమేశ్వర రావు , చీఫ్ మేనేజర్ హెచ్ ఆర్ , ఎస్బిఐ ఆఫీసర్ అసోసియేషన్ నుండి హెచ్ శంకర్ , డి జి ఎస్ , ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ వై సతీష్, వైస్ ప్రెసిడెంట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ మాడ్యూల్ జన్ను మహేందర్ , వైస్ ప్రెసిడెంట్ పి రామన్న , డిప్యూటీ జనరల్ సెక్రెటరీ శ్రీ భూక్య అనిల్, ఏ జి ఎస్ హెడ్ క్వార్టర్స్ శ్రీ వరప్రసాద్ , ఏ జి ఎస్ వరంగల్ శ్రీ భూక్య చందర్, ఆర్ఎస్ వరంగల్ శ్రీ ఎం రాజేష్ , డిస్టిక్ వెల్ఫేర్ సెక్రెటరీ మహబూబాద్ ఎస్బిఐ ఎంప్లాయిస్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.