ఒక్క ఛాన్స్ అన్నాడు… మోసం చేసాడు-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో బండారు శ్రావణిశ్రీ
- మోసకారి జగన్ను ఇంటికి పంపాలి
ఒక్క ఛాన్స్ ఇవ్వండి సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని, ఆ మాటను పక్కన పెడితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసం చేశాడని శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ గారు మండిపడ్డారు. బాబు షూరిటీ…భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నియోజకవర్గ పరిధిలోని శింగనమల మండలం, సలకంచెరువు గ్రామంలో నిర్వహించారు. బండారు శ్రావణి శ్రీ గారు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మినీ మేనిఫెస్టో తో మహిళలు కు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని శ్రావణిశ్రీ తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు