అంగరంగ వైభవంగా అయోధ్య రామజన్మభూమి అక్షింతల శోభాయాత్ర
భైంసా :జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నడంతో దానికి సంబంధించిన రాముడి అక్షింత తలంబ్రాలు మంగళవారం బైంసా పట్టణనికి చేరడంతో రామ జన్మభూమి అక్షింతలను శివాజీ చౌక్ నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భాజా భజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షింతలను పలు గల్లీలకు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముదోల్ తాలూకా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యాలో రామ మందిర నిర్మాణ ఎన్నో ఏళ్ల కల నేటితో సహకారమైందని జనవరి 22న జరగబోయే భవ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన సంబంధించిన అక్షింత తలంబ్రాలు మహిషా కు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ తలంబ్రలు ప్రతి ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరూ ఈ తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలని ప్రతి రోజు హనుమాన్ చాలీసా రాముడి సంకీర్తనలు పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు.