చాగలమర్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ ధర్మపత్ని సుప్రజ ఆధ్వర్యములో శివుడికి అన్నాభిషేకం
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ ధర్మపత్ని సుప్రజ గార్ల సహకారముతో మహిళల ఆధ్వర్యములో శివుడికి అన్నాభిషేకం , అమ్మవారికి పసుపు కొమ్ములతో వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది.అదే విధంగా పూజారి కైప నరసింహ శాస్త్రి ఆధ్వర్యములో శివ పార్వతులకు రుద్రాభిషేకం , 108 దీపాలతో 108 సార్లు హారతి అలాగే కోటివత్తుల దీపం వెలిగించారు.అదే విధంగా సమరసత సేవా ఫౌండేషన్ మహిళ సహ కన్వీనర్ యల్లంపల్లే లక్ష్మీదేవి ఆధ్వర్యములో 108 సార్లు శ్రీ రామ జయ రామ జయ రామ అంటూ శ్రీరామ జపం చేశారు.పూజ అనంతరం అన్నాబిషేకం లో ఉన్న అన్నాన్ని ప్రసాదంగా పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామసుబ్బారెడ్డి , రణగాని శ్రీనివాసులు గౌడ్ , చక్రపాణి గౌడ్ , బడిగెంచల దామోదరం , తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ ధర్మపత్ని సుప్రజ , భక్తులు , తదితరులు పాల్గొన్నారు