Devotional

ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవర ఉత్సవాలు

  • కమిటీ సభ్యులకు కండువాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్

ప్రతి సంవత్సరం ఉగాదికి తొమ్మిది రోజుల ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీ దేవర అమ్మవారి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా అంతర్గా0 మండలం పెద్దంపేట గ్రామంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కమిటీ సభ్యులకు కండువాలను పంపిణీ చేసి, అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి నాయక్ పోడ్ గిరిజన తెగలకు సంబంధించిన అడవి బిడ్డలు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు, లక్ష్మీ దేవర తో పాటు పంచ పాండవులను దేవుళ్ళుగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితిగా వస్తుందని , తమ గ్రామంలో కూడా ప్రతి ఏడు ఇదేవిధంగా తమా గ్రామ బిడ్డలు మన్నే సోదరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు సంతోషంగా ఉందని, వీరిని ప్రోత్సహించడం కోసం గతంలో డప్పులు, గజ్జెలు ,ఇవ్వడం జరిగిందని, ఈ సంవత్సరం ప్రోత్సాహకంగా కండువాళిస్తూ, రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధితో పాటు ,మన్నె వారి తెగకు సంబంధించిన ప్రతి బిడ్డకు అభివృద్ధి దిశగా పనిచేయడం కోసం ఏ అవసరం ఉన్న తాము అండగా ఉంటామని హామీ ఇస్తూన్నమని, ఈ లక్ష్మీదేవి యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనీ,పాండవులు వనవాసం చేస్తున్న సందర్భంలో సోదరులకు అండగా నిలవడం కోసం వచ్చిన లక్ష్మీ అమ్మవారు వారి చేతనే వధించబడ్డ సందర్భంలో శ్రీకృష్ణుడు మళ్ళీ గుర్రం తలను అమ్మవారికి పెట్టి జీవం పోసినట్టుగా ఇతిహాసాలు చరిత్ర తెలియజేస్తున్న సందర్భంలో ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఉండావలసిన సంబంధాన్ని కుటుంబ నేపథ్యాన్ని ఐక్యతను చెప్పే ఈ సాంప్రదాయాన్ని రాబోయే రోజుల్లో కూడా ముందుకు పోవాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమార్, కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆదివాసి గిరిజన నాయకులు ఊరేటి మహేష్ , ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్ళ బుజ్జన్న, ,ఎలిగేటీ సతీష్,మానిక మల్లేష్,గంట రమేష్,ఉరేటి రమేష్,అగ్గిల మల్లేష్,పటాని మహేష్,బోయిని శ్రీనివాస్,బొట్లకుంట లక్ష్మణ్,మేడే లక్ష్మణ్,గంట మధుకర్,మడి సుధాకర్,గుండా చిన్నయ్య,తిరుపతమ్మ,పోలుక పద్మ ,పోలుక కల్పన,ఊరేటి సుమలత,అగ్గిలా రాజేశ్వరిరాజమ్మ,ఎలిగేటి భీమరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *