ఉద్యోగ కల్పనే లక్ష్యంగా హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 16న మెగా జాబ్ మేళా
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 16న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి తెలిపారు ముందుగా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు సేవా ఇంటర్నేషనల్ , నిపుణ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిసెంబర్ 16న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు బైలాకు ఉచిత రిజిస్ట్రేషన్ ఉంటుందని జాబ్ మేళా లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా ఇవ్వకూడదని తెలిపారు. రెండు సంవత్సరాలలో ఇప్పటికే ఐదు జాబ్ మేళాలు నిర్వహించామని ప్రతి జాబ్ మేళాలో 20వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు డిసెంబర్ 16న కూడా ఆరోజు ఇంటర్వ్యూలు నిర్వహించి పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిన తమ దృష్టికి తీసుకురావాలని చర్యలు తీసుకుంటామన్నారు..