ఎవరికి దక్కేనో ప్రజాపాలన -అగమ్య గోచరంగా అప్లికేషన్ విధానం
విధి విధానాలు మంజూరు కాక లబ్ధిదారుల్లో ఆందోళన
అధికారుల అలసత్వం…నిర్ణక్షం
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా లేని మహాలక్ష్మి
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి విధివిధానాలు తెలియజేయాలని కోరుతున్న ప్రజలు
మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.అసలు ఈ పథకానికి అర్హులు ఎవరనేది ఇప్పటికీ తెలియక పోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది.18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల ఒకరు,55 సంవత్సరాలు పైబడిన వారని ఇలా గందరగోళనికి గురి చేస్తున్నారు…అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు ఏ ప్పుడు అనే దానిమీద స్పష్టత లేకపోవడంతో సాధారణ మరియు మధ్యతరగతి కుటుంబాలు ఎమ్మార్వో కార్యాలయానికి ఆధార్ సెంటర్ లకు ప్రజలు బారులు తీరుతున్నారు… ఉదయం 6 గంటల నుండి ఆధార్ సెంటర్ ల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా తరలిరావడంతో ఇటు ఆధార్ నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు..
అధికారుల అలసత్వం
ఇవన్నీ కూడా గమనించవలసిన ప్రభుత్వ అధికారులు గమనించకుండా విధి విధానాలు రూపొందించకుండా ప్రభుత్వ పథకాలు అంటూ అంగు ఆర్భాటం చేయడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు సరైన సమాచారం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతూ అవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టో అప్లికేషన్ ఫామ్ కూడా 50 నుండి 100 రూపాయలు అమ్మడం దీనికి నిదర్శనం.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటి విధి విధానాలు మంజూరు చేసి ఏవేవి కావాలో పూర్తి దరఖాస్తు విధానాన్ని బాహ్యత పరచాలని ప్రజానీకం కోరుతున్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టోని కొంతమంది సూచిస్తూ దీంతో చెప్పిన విధంగా జరగడంలేదని మేనిఫెస్టో ఆధారంగా ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని సాధారణ,మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు…..